మళ్లీ నెం1 యారిగా వస్తున్న రానా..!

మళ్లీ నెం1 యారిగా వస్తున్న రానా..!

టాలీవుడ్ స్టార్ హీరోలందరూ కూడా వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా పసందైన విందు అందించేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే చిరంజీవి, నాగార్జున, ఎన్‌టీఆర్, నాని మరికొందరు తారలు బుల్లితెరవై అనేక కార్యక్రమాల్లో సందడి చేశారు. వారిలో రానా కూడా ఒకరు. నెం.1 యారి అనే షోతో అలరించారు. ఈ కార్యక్రమం ఇప్పటికి రెండు సీజన్లను పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ షో మూడో సీజన్ ప్రారంభించేందుకు సిద్దమయ్యారు. మార్చి 14 నుంచి రాత్రి 9 గంటలకు ఈ షో ఓటీటీ వేదిక ఆహాలో ప్రసారం కానుంది. ఈ మేరకు ఆహా వారు ప్రోమోను కూడా రిలీజ్ చేశారు. ఇదిలా ఉంటే రానా ప్రస్తుతం విరాట పర్వం, అరణ్య సినిమాలతో బిజీగా ఉన్నారు. వీటిలో అరణ్య ఈనెల 26న విడుదల కానుంది. ఇక విరాట పర్వం సినిమా విడుదల తేదీని మార్చనున్నట్లు వార్తలు వచ్చాయి. మరి ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తారో వేచి చూడాలి. ఇందులో రానా నక్సలైట్‌గా కనిపించనున్నారు. ఈ రెండు సినిమాలపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు ఉన్నాయి.