ఆ పార్టీతో ఎన్డీయేకు సంబంధం లేదు... 

ఆ పార్టీతో ఎన్డీయేకు సంబంధం లేదు... 

బీహార్ లో రేపు తొలివిడత పోలింగ్ జరగబోతున్న సంగతి తెలిసిందే.  ఎన్నికల నిర్వహణ కోసం ఇప్పటికే ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లు చేసింది.  అయితే, ఎన్నికల్లో పొత్తుల విషయం కుదరక లోక్ జనశక్తి పార్టీ ఎన్డీయే నుంచి బయటకు వచ్చింది.  ఎన్డీయే నుంచి బయటకు వచ్చినప్పటికీ తాను మోడీకి భక్తుడినని, ఎన్నికల తరువాత రాష్ట్రంలో బీజేపీ- ఎల్జేపీ కూటమి అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ అధినేత చిరాగ్ పాశ్వాన్ పేర్కొన్న సంగతి తెలిసిందే.  అయితే, ఎన్డీయేలో జేడీయూ కూడా ఉన్నది.  జేడీయూకి, ఎల్జేపీ పొసగడం లేదు.  ఈ ఎన్నికల్లో జేడీయూ ను ఎలాగైనా ఓడించాలని చిరాగ్ అండ్ కో ప్రయత్నం చేస్తున్నారు.  అయితే, బీజేపీ మాత్రం బీహార్ లో ఎన్డీయే అధికారంలోకి వస్తామని, నితీష్ నేతృత్వంలోనే ప్రభుత్వం ఏర్పాటవుతుందని చెప్తున్నారు.  తాజాగా కేంద్రమంత్రి అనురాగ్ ఠాగూర్ సైతం ఇదే విధంగా స్పందించారు.  ఎల్జేపీ నేత ఠాకూర్ ను ఎవరూ విశ్వసించరని, అయన పార్టీతో ఎన్డీయేకు సంబంధం లేదని అన్నారు.