బాలికను నిర్బంధించి 51 రోజులుగా గ్యాంగ్‌ రేప్‌..!

బాలికను నిర్బంధించి 51 రోజులుగా గ్యాంగ్‌ రేప్‌..!

ఎన్ని చట్టాలు వచ్చినా.. కఠిన శిక్షలు అమలు చేస్తున్నా... కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో జరిగిన ఓ ఘటన సభ్యసమాజం తలదించుకునేలా చేస్తోంది. 16 ఏళ్ల బాలికను కిడ్నాప్ చేసిన ముగ్గురు యువకులు.. 51 రోజుల పాటు ఆమెను నిర్భంధించి తమ పశువాంఛ తీర్చుకుంటూ నరకం చూపించారు. వివరాల్లోకి వెళ్తే నోయిడాకు చెందిన బాలిక ఇంటి పక్కన ఉండే చోటు, సూరజ్ అనే ఇద్దరు యువకులు ఆమెను కిడ్నాప్ చేసి.. ఓ ఇంట్లో నిర్బంధించారు. చేతులు, కాళ్లు కట్టేసి రోజూ ఆమెను శారీరకంగా హింసిస్తూ.. గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. అలా ఒకటి కాదు, రెండు కాదు.. 51 రోజుల పాటు ఆ అమ్మాయికి నరకం చూపించారు. వారితో పాటు ఆ ఇంటిని అద్దెకు ఇచ్చిన మరో యువకుడు ఆదిత్య కూడా ఆమెపై దారుణానికి పాల్పడ్డాడు. ఇలా ముగ్గురు యువకులు ఆ బాలికను చిత్రహింసలకు గురిచేశారు. అంతేకాదు పారియే ప్రయత్నాలు చేస్తే చంపేస్తామని హెచ్చరిస్తూ ఘాతుకానికి పాల్పడ్డారు. కామాంధుల చెరలో నరకం అనుభవించిన ఆ బాలిక చివరికి తప్పించుకొని తల్లిదండ్రుల వద్దకు చేరుకుని పోలీసులను ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. దీంతో ఎస్పీకి ఫిర్యాదు చేయగా.. ముగ్గురు కామాంధులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.