మాజీ ఎమ్మెల్యే డెల్లా గాడ్‌ఫ్రే కన్నుమూత

మాజీ ఎమ్మెల్యే డెల్లా గాడ్‌ఫ్రే కన్నుమూత

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ నామినేటెడ్ మాజీ ఎమ్మెల్యే డెల్లా గాడ్‌ఫ్రే కన్నుమూశారు. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో ఆరు రోజులుగా చికిత్స పొందుతున్న ఆమె ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. గాడ్‌ఫ్రే మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంతాపం ప్రకటించారు. నామినేటెడ్‌ ఎమ్మెల్యేగా ఆమె సేవలను గుర్తు చేసుకున్నారు. గాడ్‌ ఫ్రే కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్‌ ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఏపీ శాసనసభకు రెండుసార్లు ఎమ్మెల్యేగా నామినేట్ అయ్యారు. 2004 వరకు శాసనసభ్యురాలిగా కొనసాగారు. ఆంగ్లో ఇండియన్ల సంక్షేమమే కాక అందరి సంక్షేమానికి పాటుపడి ఎంతో పేరుగాంచారు. హైదరాబాద్‌ లోనే పుట్టి పెరిగిన ఆమె.. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ పట్టా పొందారు. బుధవారం మధ్యాహ్నం హైదరాబాద్‌లోని సెయింట్‌ జోసెఫ్‌ కెథడ్రాల్‌ శ్మశానవాటికలో ఆమె అంత్యక్రియలు జరగనున్నారు.