ఎన్నికల్లో పోటీ చేయడం లేదు: అక్షయ్ కుమార్

ఎన్నికల్లో పోటీ చేయడం లేదు: అక్షయ్ కుమార్

బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ సోమవారం తన ట్విట్టర్ అకౌంట్ నుంచి చేసిన ఒక ట్వీట్ రాజకీయంగా వేడిని పుట్టించింది. అక్షయ్ ట్వీట్ చూసినవారంతా ఖిలాడీ కుమార్ రాజకీయాల్లో తన అదృష్టం పరీక్షించుకోవాలని భావిస్తున్నాడని ఊహించారు. దీంతో బాలీవుడ్ సూపర్ స్టార్ వెంటనే ఇంకో ట్వీట్ చేసి ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టేశాడు.

అక్షయ్ తన మొదటి ట్వీట్ లో 'ఒక కొత్త రంగంలో అడుగు పెట్టబోతున్నాను. నేను ఇప్పటి వరకు చేయనిది ఇవాళ చేయబోతున్నాను. ఈ ఆలోచనతో నేను ఉత్సాహం పొందుతున్నాను. అప్ డేట్స్ కోసం ఇక్కడ ఒక కన్నేసి ఉంచండి.' అని పేర్కొన్నాడు. ఈ ట్వీట్ బాలీవుడ్ సహా ఆయన ఫ్యాన్స్, రాజకీయ రంగంలో పెను సంచలనం రేపింది. 

వెంటనే ఖిలాడీ అక్షయ్ కుమార్ మరో ట్వీట్ తో తను ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు వస్తున్న ఊహాగానాలకు ముగింపు పలికాడు. తన ట్వీట్ లో 'నా మొదటి ట్వీట్ పై ఆసక్తి చూపినందుకు అందరికీ ధన్యవాదాలు. ఊహాగానాలకు స్వస్తి పలకండి. నేను ఎన్నికల్లో పోటీ చేయడం లేదని స్పష్టం చేయాలనుకుంటున్నాను' అని అక్షయ్ తేల్చి చెప్పాడు.