జాతీయ రాజకీయాలపై ఆసక్తి లేదు-చంద్రబాబు

జాతీయ రాజకీయాలపై ఆసక్తి లేదు-చంద్రబాబు
జాతీయ రాజకీయాలపై ఆసక్తి లేదని మరోసారి స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు... సింగపూర్‌లో లీడర్‌షిప్ సమ్మిట్‌లో పాల్గొన్న ఏపీ సీఎం... దేశంలోని అన్ని రాష్ట్రాలకు అభివృద్ధిలో ఒక నమూనాగా ఆంధ్రప్రదేశ్‌ని తీర్చిదిద్దుతానన్నారు. కాలానుగుణంగా విధానాలను ప్రజానుకులంగా తీర్చిదిద్దుకుంటామన్నారు. సంక్షేమాన్ని, అభివృద్ధిని సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నామన్నారు చంద్రబాబు. ఒక రోజు సింగపూర్‌ పర్యటనలో వివిధ పరిశ్రమలకు సంబంధించిన ప్రముఖులను కలిశారు ఏపీ సీఎం. తన పర్యటనలో బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్ తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు... ఏపీకి రావాల్సిందిగా బ్లెయర్‌ను ఆహ్వానించారు చంద్రబాబు. అయితే నేషనల్ రాజకీయాల్లో చంద్రబాబు కీలక పాత్ర పోషిస్తారనే ప్రచారం సాగుతున్న తరుణంలో ఆయన ఆసక్తి లేదనడం చర్చగా మారింది.