మ్యాచ్ ఆడకుంటే.. ఓటమిని అంగీకరించడమే

మ్యాచ్ ఆడకుంటే.. ఓటమిని అంగీకరించడమే

ప్రపంచకప్‌లో పాక్‌తో టీమిండియా మ్యాచ్ ఆడకుంటే.. యుద్ధం చేయకుండానే ఓటమిని అంగీకరించడమే అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎంపీ శశి థరూర్‌ అభిప్రాయపడ్డారు. పుల్వామా ఆత్మాహుతి దాడిని నిరసిస్తూ ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో టీమిండియా ఆడకూడదని పలు డిమాండ్లు వస్తున్నాయి. ఈ డిమాండ్లను కొందరు ఖండిస్తున్నారు, మరికొందరు సపోర్ట్ చేస్తున్నారు. ఇరు దేశాల మధ్య మ్యాచ్‌ జరగకుంటే టీమిండియాకే నష్టమని బీసీసీఐ అధికారులు, ప్రభుత్వ వర్గాలు, సునీల్‌ గావస్కర్‌ పలువురు అంటున్నారు. తాజాగా ఎంపీ శశి థరూర్‌ కూడా ట్విటర్ వేదికగా ఇదే అభిప్రాయాన్ని  తెలిపారు.

'1999లో కార్గిల్‌ యుద్ధం జరిగిన సమయంలో భారత్‌, పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడి గెలిచింది. ఇప్పుడు మ్యాచ్ వదులుకొని రెండు పాయింట్లు కూడా ఇవ్వకూడదు. పాక్‌తో మ్యాచ్ ఆడకుండా ఉంటే వాళ్లకు లొంగిపోవడం కంటే దారుణం. యుద్ధం చేయకుండానే ఓడిపోవడం' అని థరూర్‌ ట్విటర్‌ ద్వారా అభిప్రాయపడ్డారు.