ఆర్థికలోటుకు కారణం అదే..? క్లారిటీ ఇచ్చిన ఆర్బీఐ..!

ఆర్థికలోటుకు కారణం అదే..? క్లారిటీ ఇచ్చిన ఆర్బీఐ..!

మిగులు నిధులను కేంద్రానికి ఇవ్వడం వల్లే ఆర్బీఐలో ఆర్థిక లోటు ఏర్పడిందన్న ప్రచారాన్ని... రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొట్టిపారేసింది. అలాంటి వదంతులను నమ్మొద్దని ఆర్బీఐ స్పష్టం చేసింది. తమ వద్ద ఉన్న రూ.1.76 లక్ష కోట్లను కేంద్రానికి ఇచ్చినట్లు జరుగుతున్న ప్రచారం అవాస్తమంది ఆర్బీఐ. ఆ లోటును పూడ్చుకునేందుకు తమ ఆధీనంలోని బంగారం నిల్వలో కొంతభాగాన్ని ఆర్బీఐ విక్రయించనుందన్న వార్తలు గుప్పుమన్నాయి. అయితే, అదంతా ఫేక్ అని రిజర్వ్ బ్యాంక్ ఇండియా తెలిపింది. ఈ ఏడాది ఆగస్టు నాటికి ఆర్బీఐ వద్ద.. 1.987 మిలియన్ ఔన్సుల బంగారం నిల్వ ఉంది.