రషీద్ బ్యాటింగ్ ఆశ‍్చర్యం కల‍్గించలేదు

రషీద్ బ్యాటింగ్ ఆశ‍్చర్యం కల‍్గించలేదు

ఐపీఎల్‌-11 క్వాలిఫయర్‌-2 మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ బౌలర్ రషీద్‌ ఖాన్‌ ఇన్నింగ్స్ చివరలో బ్యాట్‌తో చెలరేగి కేవలం 10 బంతుల్లో 2x4, 4x6లతో 34 పరుగులు చేసాడు. ఈ ఇన్నింగ్స్ తో క్రికెట్ అభిమానులు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. అయితే రషీద్‌ ఖాన్‌ సుడిగాలి ఇన్నింగ్స్ సన్‌రైజర్స్‌ హైదరాబాద్ జట్టుని ఎంతమాత‍్రం ఆశ్చర్యపరచలేదని భారత సీనియర్ క్రికెటర్‌ యూసఫ్‌ పఠాన్‌ అన్నారు.

మ్యాచ్ అనంతరం యూసఫ్‌ పఠాన్‌ మాట్లాడుతూ... రషీద్‌ ఖాన్ మంచి బ్యాట్స్ మెన్. ఐపీఎల్ తో పాటు బిగ్ బాష్ లీగ్ లో కూడా రాణించాడు. బ్యాట్‌తో ఫోర్స్, సిక్సులు కొట్టగలడు. అతని సామర్థ్యంపై మాకు నమ్మకం ఉంది, అందుకే ఎనమిదవ స్థానంలో బ్యాటింగ్ కి పంపాము. క్వాలిఫయర్‌-1 మ్యాచ్‌లో చెన్నై జట్టుపై రెండు సిక్సులు కొట్టాడు కావున ఈ మ్యాచ్ లో రషీద్‌ బ్యాటింగ్ మమ్మల్ని ఆశ్చర్య పరచలేదు. సన్‌రైజర్స్‌ జట్టు పెట్టుకున్న నమ్మకాన్ని రషీద్‌ నిలబెట్టాడు. చెన్నై చాలా పెద్ద జట్టు.. ఈ  విజయాన్ని ఫైనల్లో కూడా రిపీట్ చేస్తాం అని పఠాన్‌ తెలిపాడు. 

Photo: FileShot