స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం...రాయపాటి కోడలుకు నోటీసులు

స్వర్ణ ప్యాలెస్ అగ్నిప్రమాదం...రాయపాటి కోడలుకు నోటీసులు

కొవిడ్‌ కేర్‌ సెంటర్‌గా వినియోగిస్తున్న హోటల్‌ స్వర్ణ ప్యాలెస్‌లో ఇటీవల భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో పది మంది కరోనా బాధితులు మృతి చెందగా.. మరికొందరు గాయపడ్డారు. అయితే.. ఈ కేసును విజయవాడ పోలీసులు వేగవంతంగా  దర్యాప్తు చేస్తున్నారు.  తాజాగా.. రాయపాటి సాంబశివరావు కోడలు మమతకు ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. విచారణకు హాజరు కావాలని విజయవాడ పోలీసులు మమతకు నోటీసులు జారీ చేశారు. ఇటీవలే కరోనా బారిన పడి మమత ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. అయినా సరే తప్పనిసరిగా విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో మమత నేడు విజయవాడ పోలీసు కమిషనర్ కార్యాలయంలో విచారణకు హజరుకానున్నారు.