ఎమ్మెల్సీ స్ధానానికి నోటిఫికేషన్ జారీ

ఎమ్మెల్సీ స్ధానానికి నోటిఫికేషన్ జారీ

తెలంగాణలో ఎమ్మెల్యేకోటా ఎమ్మెల్సీ స్థానానికి మంగళవారం నోటిఫికేషన్ జారీ అయింది. ఈ కోటాలో ఎమ్మెల్సీగా మైనంపల్లి హనుమంతరావు కొనసాగారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన మల్కజ్ గిరి నుంచి టీఆర్ఎస్ తరుపున ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దీంతో ఆయన తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఖాళీ ఏర్పడిన ఈ స్ధానానికి ఎన్నిక నిర్వహించేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు. జూన్ 7వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహించనున్నారు. అదే రోజున ఫలితం వెలువడనుంది.