సిన్సినాటి ఓపెన్‌ గెలిచిన 'జొకోవిచ్‌'

సిన్సినాటి ఓపెన్‌ గెలిచిన 'జొకోవిచ్‌'

అమెరికా వేదికగా జరుగుతున్న సిన్సినాటి ఓపెన్‌ మాస్టర్స్‌ టోర్నమెంట్‌లో సెర్బియా స్టార్ నొవాక్‌ జొకోవిచ్‌ విజయం సాధించాడు. ఓహిలో ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్‌ ఫైనల్లో జొకోవిచ్‌ 6-4, 6-4తో స్విట్జర్లాండ్‌ టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌పై గెలుపొంది కప్ సొంతం చేసుకున్నాడు. దీంతో తొలిసారి సిన్సినాటి మాస్టర్స్ టైటిల్ ను దక్కించుకున్నాడు. ఫెడరర్ ఏడు సార్లు ఈ టైటిల్ గెలిచాడు.. అయితే ఫైనల్లో ఓడిపోవడం ఇదే మొదటిసారి. మరోవైపు జొకోవిచ్‌ ఐదుసార్లు ఫైనల్లో ఓడిపోయిన తరువాత తొలిసారి విజయం సాధించాడు.

పురుషుల సింగిల్స్‌ సెమీఫైనల్లో జొకోవిచ్‌ 6–4, 3–6, 6–3తో మారిన్‌ సిలిచ్‌(క్రొయేషియా)పై గెలిచి ఫైనల్ చేరాడు. ఫెడరర్‌ 7–6 (7/3), 1–1తో డేవిడ్‌ గాఫిన్‌(బెల్జియం)పై విజయం సాధించాడు.ఈ మ్యాచ్‌లో గాఫిన్‌ తొలి సెట్‌లో ఓడిపోయాక.. రెండో సెట్‌లో స్కోరు 1–1 వద్ద ఉన్నపుడు గాయం కారణంగా వైదొలిగాడు.