సెమీస్‌లో జకోవిచ్...

సెమీస్‌లో జకోవిచ్...

వింబుల్డన్‌లో సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లాడు సెర్బియా స్టార్ నొవాక్ జకోవిచ్... పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో జపాన్ క్రీడాకారుడు నిషికోరిపై 6-3, 3-6, 6-2, 6-2 తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టాడు. దీంతో రెండేళ్ల తర్వాత వింబుల్డన్ సెమీ ఫైనల్ చేరాడు జకోవిచ్. తొలి సెట్‌ను 6-3తో  కైవసం చేసుకున్న జకోవిచ్‌ అనూహ్యంగా రెండో సెట్‌ను 3-6తో కోల్పోయాడు. ఆ తర్వాత మళ్లీ పుంజుకున్న సెర్బియా స్టార్... వరుసగా మూడు, నాలుగు సెట్లను 6-2, 6-2 తేడాతో కైవసం చేసుకుని సెమీస్‌లో అడుగుపెట్టాడు. రెండు సంవత్సరాల క్రితం మొత్తం నాలుగు గ్రాండ్ స్లామ్ టైటిల్స్ సాధించిన ఆటగాడైన జకోవిచ్... మళ్లీ తన పూర్వపూ ఆటను చూపించాడు. గత గ్రాండ్ స్లామ్‌లో చివరి నాల్గో స్థానంలో ఉండాలని భావించా... కానీ, అది జరగలేదు. అయితే గత రెండు వారాలుగా నేను ఫామ్‌లో ఉన్నా... నేను ఇక్కడ సెమీ ఫైనల్స్ లో అడుగుపెట్టడం తొలిసారి కాదు... కానీ, నేను ఈ విజయాన్ని ఆస్వాదిస్తున్నానని తెలిపాడు.