ఫెదరర్, నాదల్‌ రికార్డులను బ్రేక్ చేసిన జకోవిచ్...

ఫెదరర్, నాదల్‌ రికార్డులను బ్రేక్ చేసిన జకోవిచ్...

పీట్ సాంప్రాస్ రికార్డును సమం చేశాడు నొవాక్ జకోవిచ్. పురుషుల టెన్నిస్ ప్రపంచంలో అత్యధిక సీజన్లను నంబర్ వన్ ర్యాంక్‌తో ముగించిన... సాంప్రాస్ సరసన జకో చేరిపోయారు. 1993 నుంచి 1998 వరకూ సాంప్రాస్ అన్ని సీజన్‌లనూ టాప్‌లో ఉంటూ ముగించగా... జకోవిచ్ 2011, 2012, 2014, 2015, 2018, 2020 సీజన్ లను టాప్ ర్యాంక్‌తో ముగించాడు. ఈ క్రమంలో రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్‌ రికార్డులను దాటాడు జకోవిచ్. గత సీజన్‌లో మొత్తం 42 టెన్నిస్ మ్యాచ్‌లు ఆడిన జకోవిచ్... 39 విజయాలు సాధించాడు.  కేవలం మూడింట మాత్రమే ఓడిపోయాడు. చిన్నప్పుడు తాను సాంప్రాస్‌ను ఎంతో ఆరాధించేవాడినని, ఇప్పుడు తన అభిమాన ఆటగాడి రికార్డును సమం చేయడంతో తన కల నిజమైందన్నారు జకోవిచ్‌.