అభిమానులే నా రచనలకు బలం   

అభిమానులే నా రచనలకు బలం   

నవలా రాణిగా పేరు ప్రఖ్యాతులు సంపాందించుకున్నారు యద్దనపూడి సులోచనా రాణి. చిదివింది పదవ తరగతే అయినా సమాజాన్ని మాత్రం అపారంగా అధ్యయనం చేశారు సులోచనా రాణి. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా నవలా రచనలో మకుటం లేని మహారాణిలా వెలుగొందిన ఆమె.. ఆంధ్రుల అభిమాన రచయిత్రి. 

యద్దనపూడి సులోచనారాణి రాసిన సెక్రటరీ నవల సంచలనం సృష్టించింది. అది ఆమె మొదటి తెలుగు నవల. 23 సంవత్సరాల వయసులో ఆమె ఆ నవల రాశారు. ఆ తర్వాత యాభై ఏళ్లలో డైబ్బై ఐదు నవలలు రాశారు. సెక్రటరీ నవల తెచ్చిన పెట్టిన ప్రచారం అంతా ఇంతా కాదు. ఎన్నో ప్రశంసలు పొందారు. మొదట కథలు రాసిన ఆమె నవలా రచనల ద్వారా ఎంతో పేరు పొందారు. అభిమానులు, నేను, పబ్లిషర్స్ త్రివేణీ సంగమంలా ఉండేది. ఎంతోమంది మగవారు పుస్తకంపైన ఆడవారి పేరు ఉంటే తీసుకొనే వారు. అలాగే...  నా నవలలను సినిమాగా చేసేప్పుడు మార్పులు.. చేర్పులు అని రాయడంతో నిర్మాత, దర్శకులు వాటిలో మార్పులు చేసేవారు. ఆ స్వాతంత్ర్యం ఉండాలి. అలా లేకపోతే కష్టం. అలాగే... ఆడవారిలో అందం మాత్రమే చూసే వారు యద్దనపూడి సినిమాలు వచ్చిన తర్వాత వారి యాటిట్యూడ్ ను చూడటం మొదలెట్టారు. ఆడవారి అందాన్ని ప్రబంధాలు గానీ... కావ్యాలు గానీ అప్పటివరకు అందాన్ని ఫిజికల్ భావాలను తీసి పక్కనబెట్టి యద్దనపూడి సులోచనారాణి యాటిట్యూడ్ ను అలవాటు చేశారు. ఆడవారి ఆత్మాభిమానాన్ని పెంచేలా రచనలు చేశారు. ఒక్క సెక్రటరీ నవలే కాకుండా యద్దనపూడి సులోచనారాణి రాసిన అన్ని నవలలతో పాటు ఆమె జీవిత విశేషాలు వనితా టీవీలో ముఖాముఖితో పంచుకున్నారు.. ఆ విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోను క్లిక్ చేయండి.