న‌వంబ‌రు 25 - డిసెంబర్ 1.. ఈ వారం మీ వారఫలాలు

న‌వంబ‌రు 25 - డిసెంబర్ 1.. ఈ వారం మీ వారఫలాలు

మేషం: 
(అశ్విని, భరణి, కృత్తిక 1వ పాదం) 
అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. ధనలాభం, మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఉద్యోగంలో సానుకూలంశాలు ఉన్నాయి. వ్యాపారంలో ధన నష్టం ఉంది. ముఖ్య విషయాల్లో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు.  శత్రువులతో జాగ్రత్త. ఒడుదొడుకులున్నా బుద్ధిబలంతో విజయం సాధిస్తారు. శివారాధన మంచిది.
వృషభం: 
(కృత్తిక 2,3,4 పాదాలు; రోహిణి, మృగశిర 1,2 పాదాలు) 
చేపట్టిన పనులు పూర్తవుతాయి. పట్టుదలతో చేసే పనులు మాత్రమే విజయాన్నిస్తాయి. ఇతరులతో ఆచితూచి మాట్లాడండి. కొన్ని సార్లు అపార్థాలకు అవకాశముంది. అదృష్టకాలం కొనసాగుతోంది. ముఖ్యమైన పనుల్లో శ్రద్ధ అవసరం. ధైర్యంగా  చేసే పనుల్లో ముందుకెళ్లండి. ఆర్థికంగా పుంజుకుంటారు. వేంకటేశ్వరస్వామిని దర్శించండి.
మిథునం:
(మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు) 
పనుల్లో మంచి శుభఫలితాలున్నాయి. సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఉద్యోగంలో అనుకున్నది సాదిస్తారు. ఆనందంగా కాలం ముందుకు సాగుతుంది. ముఖ్య విషయాల్లో పెద్దలను సంప్రదించండి. కొన్ని ఇబ్బందులు ఎదురైనా త్వరగానే  పరిష్కారమవుతాయి. ప్రయాణాల్లో కొంత జాగ్రత్త అవసరం. విష్ణుస్మరణ చేయండి. 
కర్కాటకం:
(పునర్వసు 4వ పాదం; పుష్యమి, ఆశ్లేష) 
శుభకాలం నడుస్తుంది. శక్తి వంచన లేకుండా పనులు ప్రారంభించండి.. శుభ ఫలితాలున్నాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. పనుల్లో అధికారుల సహకారం అందుతుంది. ఒక పనిలో పురోగతి ఉంటుంది. మిత్రుల నుండి సహాయం  అందుతుంది. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. బంధువులను కలుసుకుంటారు. గణపతి ఆరాధన మంచిది.
సింహం:
(మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం) 
చిత్తశుద్ధితో పనిచేసి మంచి ఫలితాన్ని పొందుతారు. ఉద్యోగ విషయంలో శుభఫలితాలున్నాయి. వ్యాపారయోగం కూడా బాగుంది. ఆటంకాలను అధిగమిస్తారు. సాహసంతో చేసే పనులు ఫలిస్తాయి. తోటివారి నుంచి తగినంత ప్రోత్సాహం  లభిస్తుంది. ప్రశాంత వాతావరణం లభిస్తుంది. ఇష్టదైవ దర్శనం మేలు చేస్తుంది.
కన్య: 
(ఉత్తర 2, 3, 4 పాదాలు; హస్త, చిత్త 1, 2 పాదాలు) 
మంచి శుభ పలితాలున్నాయి. చేపట్టిన పనులు త్వరగా పూర్తవుతాయి. కొన్ని పనుల్లో స్వల్ప ఆటంకాలున్నాయి.. తెలివిగా వాటిని పరిష్కరించాలి. ధనయోగముంది. ప్రయాణలు చేస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. కుటుంబసభ్యులకు శుభం  జరుగుతుంది. సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి.
తుల: 
(చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు) 
 పనులు త్వరగా పూర్తవుతాయి. సొంతంగా నిర్ణయాలు తీసుకోండి. పెద్దల సలహాలు తీసుకోండి. అనుకూల కాలం నడుస్తోంది. ఆర్థికంగా లాభిస్తుంది. వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. గొడవలకు పోరాడు. మిత్రుల ద్వారా మేలు  జరుగుతుంది. ఒక వార్త మిమ్మల్ని సంతోషపెడుతుంది. శివధ్యానం ఉత్తమం.
వృశ్చికం:
(విశాఖ 4వ పాదం; అనూరాధ, జ్యేష్ఠ) 
చేపట్టిన పనుల్లో ఏకాగ్రత అవసరం. లేకపోతే నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ముఖ్యకార్యాల్లో జాగ్రత్త అవసరం. అవసరమైతే పెద్దల సలహాలు తీసుకోండి. మోసం చేసేవారున్నారు. దైవబలం లభిస్తుంది. ఆపదల నుంచి త్వరగా బయటపడతారు.  ఆర్థికంగా మిశ్రమకాలం నడుస్తోంది. లక్ష్మీ అష్టోత్తరం చదవడం మంచిది.
ధనుస్సు:  
(మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1వ పాదం) 
విజయాన్ని సొంతం చేసుకుంటారు. మీరు అనుకున్న పనినే చేయండి. ఇంటా బయటా శుభం జరుగుతుంది. విజయాన్ని పొందే క్రమంలో కొన్ని ఆటంకాలు ఉన్నా..  బుద్ధిబలంతో వాటిని అధిగమించండి. ఆర్థిక విషయాల్లో కొంత ఇబ్బంది  ఉంటుంది. సూర్యారాధన ఆత్మశక్తినిస్తుంది.
మకరం:
(ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు; శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు) 
విజయావకాశాలు ఉన్నాయి. సమాజంలో కీర్తి లభిస్తుంది. ధనయోగం ఉంది. శుభకాలం ప్రారంభమైనది. పెద్దల నిర్ణయాలు ఫలితాన్నిస్తాయి. గతంలో పరిష్కారం కాని ఒక అంశం ఇప్పుడు కొలిక్కి వస్తుంది. వాహన యోగముంది. లక్ష్మీపూజ  చేయండి.
కుంభం:
(ధనిష్ట 3, 4 పాదాలు; శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదాలు) 
అనుకూల కాలం. విజయం లభిస్తుంది. మిత్రబలంతో కార్యాలు పూర్తిచేస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో శుభఫలితాలున్నాయి. కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. స్థిరాస్తి వృద్ధిచెందే అవకాశముంది. సరైన ప్రయత్నం ద్వారా అనుకున్నది దక్కుతుంది. పెద్దల  సలహాలు మేలు చేస్తాయి. ఆదిత్య హృదయం చదువుకోవాలి.
మీనం:
(పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) 
విజయం లభిస్తుంది. పనుల్లో కొంత శ్రమించాలి. మధ్యలో ఆటంకాలున్నా పట్టుదల అవసరం. అదృష్ట యోగముంది. సమాజంలో ప్రత్యేకమైన గౌరవం లభిస్తుంది. ఆనందంగా ఉంటారు. మిత్రుల సూచనలతో ఆటంకాలు తొలగుతాయి. ఆదిత్య హృదయం పారాయణం మంచిది.