బంగారం కొనేందుకు సువర్ణావకాశం

బంగారం కొనేందుకు సువర్ణావకాశం

ఈ ఏడాది ప్రథమార్థంలో పలు కారణాల వల్ల బంగారం ధరలు క్షీణించినా... మున్ముందు పెరిగే అవకాశాలు ఉన్నాయని వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ అంచనా వేస్తోంది. ఈ ఏడాది మధ్యంతర నివేదికను ఇవాళ కౌన్సిల్‌ విడుదల చేసింది. ప్రథమార్ధంలో డాలర్‌ బలపడం, అధిక స్థాయిలో బంగారం కొనేందుకు ఇన్వెస్టర్లు ఇష్టపడకపోవడంతో పాటు సాధారణ ప్రజలు కూడా మార్కెట్‌లో బంగారం కొనేందుకు ఆసక్తి చూపకపోవడంతో బంగారం ధరలు క్షీణించాయని పేర్కొంది. ఈ ఏడాది ప్రతమార్థం వరకే తీసుకుంటే బంగారం కన్నా కమాడిటీ మార్కెట్‌, సిల్వర్‌, వర్ధమాన దేశాల స్టాక్‌ మార్కెట్లు భారీగా క్షీణించాయి.  ఇదే సమయంలో  టెక్నాలజీ షేర్లు భారీగా లబ్ది పొందాయి.ముడి చమురు కూడా.

 

 

 

 

డాలర్‌ బలపడం కారణంగా బంగారం ధర తగ్గిందని.. దిగువ స్థాయిలో మద్దతు అందడంతో పాటు అ్రగదేశాల మధ్య వాణిజ్య యుద్ధ భయాలు ఉండనే ఉన్నాయని.. దీంతో బంగారం ధరలు పెరిగే అవకాశముందని వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ అంచనా వేసింది. జనం వద్ద నిధులు అందుబాటు పెరిగిందని, అలాగే సాంకేతికంగా కూడా అనుకూల అంశాలు  ఉన్నాయని పేర్కొంది. దీర్ఘకాలిక పొదుపు గురించి ఆలోచించేవారు కూడా బంగారం కొనుగోలు చేసే అవకాశముందని అంటోంది. స్టాక్‌ మార్కెట్‌లో రిస్క్‌ పెరగడం, సురక్షిత సాధనంగా బంగారానికి డిమాండ్‌ పెరిగే అవకాశముందని అంచనా వేస్తోంది.