పౌరసత్వ బిల్లు చర్చకు లోక్ సభ ఆమోదం 

పౌరసత్వ బిల్లు చర్చకు లోక్ సభ ఆమోదం 

జాతీయ పౌరసత్వ బిల్లును ప్రవేశపెట్టడానికి ఎన్నో రోజులుగా ఇబ్బందులు పడుతున్నది కేంద్రం.  2014, 2019 ఎన్నికల మేనిఫెస్టోలో బీజేపీ పౌరసత్వ బిల్లును తీసుకొస్తామని చెప్పింది.  ఈ బిల్లును శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదముద్ర వేయించాలని కేంద్రం చూస్తున్నది.  కాగా, ఈరోజు ఈ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టారు.  

ఈ బిల్లుపై చర్చ జరిగిన తరువాత ఓటింగ్ జరిగింది.  బిల్లుకు అనుకూలంగా 293, వ్యతిరేకంగా 82 ఓట్లు వచ్చాయి.  దీంతో లోక్ సభలో బిల్లుపై చర్చ జరిగేందుకు ఆమోదం లభించింది. లోక్ సభలో ఆమోదం లభించినా.. బిల్లుకు రాజ్యసభలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నది. ఈ బిల్లును అసదుద్దీన్ ఒవైసి వ్యతిరేకించడమే కాకుండా, సభలోనే పేపర్లు చించేశారు.  అలానే, తెరాస పార్టీ కూడా ఈ బిల్లును వ్యతిరేకించింది.  కానీ, వైకాపా, శివసేన పార్టీలు ఈ బిల్లుకు మద్దతు తెలపడం విశేషం.  మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి.  మాములుగా ఈ బిల్లుకు శివసేన వ్యతిరేకత వ్యక్తం చేస్తుందని అనుకున్నారు.  కానీ, శివసేన కూడా ఈ బిల్లుకు మద్దతు తెలపడంతో కాంగ్రెస్ పార్టీ షాక్ అయ్యింది.  ముస్లిమేతరులకు తప్పించి మిగతా వాళ్లకు పౌరసత్వం ఇవ్వడం అన్నది ముమ్మటిది తప్పని ప్రతిపక్ష పార్టీలు అంటున్నాయి.  మత ప్రాతిపదికన పౌరసత్వం ఇవ్వడం సరికాదని ప్రతిపక్షాలు అంటున్నాయి.