భర్త వేధింపులతో... ఆత్మహత్య 

భర్త వేధింపులతో... ఆత్మహత్య 

ఓ ఎన్ఆర్ఐ భర్త వేధించాడని వాణి అనే వివాహిత విషం తాగి  ఆత్మహత్య చేసుకుంది. విశాఖ జిల్లా పెదవాల్తేరులోని ప్రిన్స్ అపార్టుమెంట్ లో నివాసం ఉంటోన్న వివాహిత ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేగుతుంది. వాణి ఆత్మహత్యకు     భర్త వేధింపులే కారణమని అనుమానం వ్యక్తమౌతుంది. నిందితుడుపై చర్యలు తీసుకోవాలని అమ్మాయి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.