హెల్త్ క్యాంప్, జాబ్‌ మేళా.. పుట్టినగడ్డ కోసం ఎన్నారైలు...

హెల్త్ క్యాంప్, జాబ్‌ మేళా.. పుట్టినగడ్డ కోసం ఎన్నారైలు...

పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవడానికి ఎన్‌ఆర్‌ఐలు కదిలారు... ఓ వైపు మెగా హెల్త్ క్యాంపు నిర్వహించి.. మెరుగైన వైద్యసేవలు అందించడంతో పాటు.. మరోవైపు స్కీల్ డెవలప్‌మెంట్, జాబ్ మేళా నిర్వాహించి ఎంతో మందికి ఉపయోగపడ్డారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. అమెరికన్ తెలుగు సంఘం ఆధ్వర్యంలో ఆదిలాబాద్ జిల్లాలోని జామ్ గ్రామంలో మెగా హెల్త్ క్యాంపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అమెరికా తెలుగు సంఘం అధ్యక్షుడు పరమేశ్ భీంరెడ్డి, ఆట తదుపరి అధ్యక్షుడు భువనేశ్ బుజాల, ఆటా బోర్డ్ ఆఫ్ ట్రస్టీ అనిల్ బోధి రెడ్డి పలువురు ఇండియా ఆటా కోఆర్డినేటర్లు పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు. గ్రామంలోని వృద్ధులు, మహిళలు, చిన్నారులకు ఉచితంగా వివిధ రకాల వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. 

మరోవైపు అమెరికా తెలుగు సంఘం నిర్వహిస్తున్న ఆటా ఇండియా వేడుకల్లో భాగంగా ఇవాళ సుర్యాపేట జిల్లాలో స్కీల్ డెవలప్‌మెంట్, జాబ్ మేళా నిర్వాహించారు. ఈ కార్యక్రమంలో ఆటా ఎలెక్ట్ ప్రసిడెంట్ బువనేశ్ బుజాలా, ఆటా బోర్డ్ ఆఫ్ ట్రస్టీ అనిల్ బోదిరెడ్డి, రామకృష్ణ రెడ్డి అలా, ఆటా 2020 కన్వేంషన్ కన్వీనర్ నర్సింహా రెడ్డి ద్యాసాని, కిషోర్ గూడూరు పలువురు ఆటా ప్రతినిధులు హాజరుకాగా మోతి మండల ఎంపీపీ ఉషా, ఎండీవో, జెడ్పిటీసీ, సర్పంచ్ పాల్గొన్నారు. మామిల్లాగూడెంలోని ఓ హాల్ లో ఏర్పాటు చేసిన స్కీల్ డెవలప్‌మెంట్, జాబ్ మేళాలో పెద్దఎత్తున యువత పాల్గొన్నారు. టాటా స్ట్రైవ్ స్కీల్ డెవలప్‌మెంట్ సెంటర్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మేళాలో బిజినెస్ డెవల్‌మెంట్, బీపీవో సీసీఈ, ఆటోమోబైల్స్ సెల్స్‌ ఎగ్జిక్యుటివ్స్, హాస్పిటాలీటీ ఫూడ్ అండ్ బెవరెజ్ స్టెవర్డ్, రిటైల్ సెల్స్ అసోసియేట్, అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్, క్వీక్ సర్వీస్ రెస్టారెంట్ లాంటి అంశాలపై స్కిల్ డెవలప్‌మెంట్ నిర్వహించారు.