అమెరికాలో మోడీ.. కాశ్మీర్ లో దోవల్.. పాక్ కు చెక్..!! 

అమెరికాలో మోడీ.. కాశ్మీర్ లో దోవల్.. పాక్ కు చెక్..!! 

అమెరికాలో ఈనెల 24 నుంచి 30 వ తేదీ వరకు ఐక్యరాజ్యసమితి సమావేశాలు జరగబోతున్నాయి.  ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు మోడీ అమెరికా వెళ్తున్నారు.  దానికంటే ముందు అమెరికాలోని హ్యూస్టన్ లో జరిగే భారతీయ అమెరికన్లు ఏర్పాటు చేసిన హౌడీ మోడీ కార్యక్రమంలో మోడీ పాల్గొనబోతున్నారు.  ఈ కార్యక్రమంలో మోడీతో పాటు అమెరికా అధ్యక్షుడు కూడా పాల్గొనడం విశేషం.  దాదాపు 50వేలమంది ఈ సభకు హాజరవుతున్నారు.  

ఇదిలా ఉంటె, కాశ్మీర్ విషయంలో ఇప్పటి వరకు పాక్ అంతర్జాతీయ వేదికలపై చేసిన ఫిర్యాదులు ఫలించలేదు. ఐక్యరాజ్య సమితి సమావేశాలు జరిగే సమయంలో కాశ్మీర్లో అలజడులు సృష్టిస్తే.. తద్వారా ఆ సమావేశాల్లో తమ వాదనకు బలం చేకూరుతుందని, ఎలాగైనా కాశ్మీర్లో అలజడులు సృష్టించాలని పాక్ భావిస్తోంది.  దీనికోసం భారీ కుట్రపన్నినట్టు సమాచారం.  ఐబి హెచ్చరికలతో జమ్మూ కాశ్మీర్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.  అంతేకాదు, మోడీతో కలిసి అమెరికా వెళ్లాల్సిన జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్.. ఇండియాలోనే ఉండి కాశ్మీర్ విషయంపై దృష్టి పెట్టబోతున్నారు.  పాక్ ఎత్తుగడలకు చెక్ పెట్టేందుకు ఇండియా సిద్ధం అయ్యింది.