అజిత్ దోవల్ కు కీలక బాధ్యతలు అప్పగించిన కేంద్రం..!!

అజిత్ దోవల్ కు కీలక బాధ్యతలు అప్పగించిన కేంద్రం..!!

జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కు కేంద్రం మరో కీలక బాధ్యతను అప్పగించింది.  త్రివిధ దళాలకు చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ పదవికి అర్హులైన వ్యక్తిని ప్రతిపాదించే భాద్యతను, చీఫ్ ఢిఫెన్ స్టాఫ్ పదవికి తగిన నిబంధనలు రూపొందించే బాధ్యతలను ఆయనకు అప్పగించారు.  దీనికోసం అజిత్ దోవల్ అధ్యక్షతన ఓ కమిటీని ఏర్పాటు చేసింది.  ప్రస్తుతం ఎయిర్ చీఫ్ మార్షల్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న బిఎన్ ధనోవా సెప్టెంబర్ 30 న పదవీవిరమణ చేయబోతున్నారు.  

తాజా వార్తల ప్రకారం చీఫ్ ఢిఫెన్స్ స్టాఫ్ పదవి ఆర్మీ చీఫ్ బిపిన్ రావత్ ను వరించే అవకాశాలు ఉన్నాయి.  ప్రస్తుతం అజిత్ దోవల్ రష్యాలో పర్యటిస్తున్నారు.  అక్కడి నుంచి అయన ఫ్రాన్స్ వెళ్తున్నారు.  మోడీతో పాటు అజిత్ దోవల్ ఫ్రాన్స్ లో పర్యటిస్తారు.  అక్కడి నుంచి ఇండియాకు వచ్చిన తరువాత ఈ చీఫ్ డిఫెన్స్ చీఫ్ స్టాఫ్ పదవికి సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించే భాద్యతలు తీసుకుంటారని తెలుస్తోంది.