సౌదీలో ఇండియన్ జేమ్స్ బాండ్.. కారణం..!! 

సౌదీలో ఇండియన్ జేమ్స్ బాండ్.. కారణం..!! 

ఆర్టికల్ 370 రద్దు తరువాత ఇండియా... దేశాల మధ్య దౌత్యపరమైన సంబంధాలు దారుణంగా దెబ్బతిన్నాయి.  బోర్డర్ లో పదేపదే కవ్వింపు చర్యలకు పాల్పడటమే కాకుండా ఇండియాతో యుద్ధం చేస్తామని బహిరంగంగా చెప్తోంది.  దీంతో రెండు దేశాల మధ్య ఉద్రిక్తకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి.  అంతేకాదు, ఇక ఐరాసలో పాక్ కు టర్కీ, మలేషియాలు మాత్రమే మద్దతు పలికాయి.  పాక్ మిత్రదేశాలుగా ఉన్న సౌదీ, యూఏఈ దేశాలు తటస్థంగా ఉన్నాయి.  

అయితే, ఆర్టికల్ 370 రద్దును ఎందుకు చేయాల్సి వచ్చింది... ఈ విషయంలో పాక్ ఎందుకు దూకుడుగా వ్యవహరిస్తోంది అనే విషయాలను సౌదీ యువరాజుకు వివరించేందుకు భారత భద్రతా సలహాదారుడు అజిత్ దోవల్ ఆ దేశంలో పర్యటిస్తున్నారు.  భారత్ లో సౌదీ $100 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టబవుతున్నది.  రెండు దేశాల మధ్య వాణిజ్యపరంగా సహకారాలు అందించుకునేందుకు, ఉగ్రవాదంపై సంయుక్తంగా పోరాటం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి చర్చించేందుకు దోవల్ సౌదీ వెళ్లారు.  అజిత్ సౌదీ వెళ్లారని తెలుసుకున్న పాక్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.  అజిత్ దోవల్ పర్యటనపై పాక్ ఎలా స్పందిస్తుందో చూడాలి.