పవన్ కళ్యాణ్ కు ఎన్.ఎస్.జీ భద్రత...!! 

పవన్ కళ్యాణ్ కు ఎన్.ఎస్.జీ భద్రత...!! 

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ విషయంలో కేంద్రం ఓ సంచలన నిర్ణయం తీసుకుంది.  పార్టీ అధ్యక్షుడిగా కొంత భద్రత ఉంటుంది.  అయితే, పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తు పెట్టుకొని ఎన్డీఏలో భాగస్వామ్యం కావడంతో ఆయనకు కేంద్రం భద్రతను పెంచింది.  8+8 ఎన్.ఎస్.జీ కమాండో భద్రతను కల్పిస్తూ కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది.  

ఇటీవలే ఢిల్లీ వెళ్లి వచ్చిన తరువాత పవన్ కళ్యాణ్ బీజేపీతో పొత్తులు పెట్టుకునే విషయంపై చర్చించారు.  అనంతరం ఇరు పార్టీలు సమావేశమయ్యి ఎన్నికల్లో పొత్తుల గురించి, అమరావతి రైతుల సమస్యలపై పోరాటం చేసే విషయం గురించి చర్చించిన సంగతి తెలిసిందే.  రెండు పార్టీల మధ్య పొత్తుల ఒప్పందం కుదిరిన వెంటనే పవన్ కు భద్రత కల్పిస్తూ నిర్ణయం తీసుకోవడం విశేషం.