ఎన్టీఆర్ హీరోయిన్ సింగర్ గా మారుతోందా ?

ఎన్టీఆర్ హీరోయిన్ సింగర్ గా మారుతోందా ?

ముకుందా సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ డీజే సినిమా తరువాత వరస పెద్ద సినిమాలు చేయడం మొదలుపెట్టింది.  ఎన్టీఆర్ అరవింద సమేత సూపర్ హిట్ కావడంతో.. నమ్మకం పెరిగింది.  ఆ తరువాత మహర్షి చేసింది.  ఈ సినిమా కూడా బంపర్ హిట్ కొట్టింది.  ఇప్పుడు ప్రభాస్ తో జాన్, అల్లు అర్జున్.. త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా చేస్తున్నది.  

అరవింద సమేత సినిమాలో పూజానే సొంతంగా వాయిస్ చెప్పుకుంది.  తన వాయిస్ హస్కిగా ఉండటంతో అల్లు అర్జున్ సినిమాలో సాంగ్ పాడేందుకు సిద్ధం అయ్యింది. పూజా సాంగ్ పాడనే కోరికను తెలుసుకున్న త్రివిక్రమ్.. థమన్ చేత ఓ స్పెషల్ సాంగ్ చేయించినట్టు సమాచారం.  మరి ఈ సాంగ్ డ్యూయెట్ లా ఉంటుందా లేదంటే సోలో సాంగ్ లా ఉంటుందా చూడాలి.