మహేష్, ఎన్టీఆర్ ఇద్దరూ ఒకేలా..?

 మహేష్, ఎన్టీఆర్ ఇద్దరూ ఒకేలా..?

మహేష్ బాబు తన కెరీర్లో బెస్ట్ చిత్రాల్లో ఒకటిగా చెప్పుకునే సినిమా శ్రీమంతుడు.  ఇందులో మహేష్ స్టూడెంట్ గా కొన్ని సీన్స్ లో కనిపించి ఫ్యాన్స్ కు కిక్కెకించాడు.  తరువాత ఇటీవలే వచ్చి సూపర్ హిట్టైన భరత్ అనే నేను ప్రారంభ సన్నివేశాలల్లో విదేశాల్లో చదువుకునే విద్యార్థిగా కనిపించి కనువిందు చేశాడు.  మహేష్ తన 24 సినిమాల్లో స్టూడెంట్ రోల్స్ చేసిన సినిమాలు చాలా తక్కువ.  ఇప్పుడు వంశి పైడిపల్లితో చేస్తున్న సినిమాలో మహేష్ బాబు స్టూడెంట్ గా కనిపించబోతున్నాడు.  ఒకవైపు స్టూడెంట్ గా, మరో షెడ్ లో ఓ కంపెనీ సీఈఓగా కనిపించబోతున్నాడు.  మహేష్ బాబు స్టూడెంట్ రోల్ లో చాలా రఫ్ గా కనిపిస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వస్తున్నాయి.  మరి స్టూడెంట్ గా ఫ్యాన్స్ ను ఎలా మెప్పిస్తాడో చూడాలి.  

అటు అరవింద సమేత వీర రాఘవ సినిమాలో ఎన్టీఆర్ కూడా స్టూడెంట్ గా అలరించబోతున్నాడు.  అరవింద సమేతలోను ఎన్టీఆర్ రెండు భిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు.  ప్రస్తుతం స్టూడెంట్ రోల్ కు సంబంధించిన సీన్స్ చిత్రీకరణ జరుగుతోంది.  ఎన్టీఆర్ తాను నటించిన 27 సినిమాల్లో స్టూడెంట్ పత్రాలు చేసిన సినిమాలు కొన్ని మాత్రమే.  అందులో స్టూడెంట్ నెంబర్ 1, జనతా గ్యారేజ్ సినిమాలు చెప్పుకోదగినవి. కాగా, ఇప్పుడు అరవింద సమేతలో ఎన్టీఆర్ ను త్రివిక్రమ్ స్టూడెంట్ గా ఎలా చూపించబోతున్నాడా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.