సూపర్ స్టార్ కోసం ఎన్టీఆర్.. రామ్ చరణ్ సిద్ధం..!

సూపర్ స్టార్ కోసం ఎన్టీఆర్.. రామ్ చరణ్ సిద్ధం..!

ఎన్టీఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా ఆర్ఆర్ ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది.  ఇప్పటికే దాదాపుగా 40% షూటింగ్ పూర్తయింది.  ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రాజమౌళి తెరకెక్కిస్తున్నారు.  భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా వచ్చే ఏడాది జులై 30 న రిలీజ్ కాబోతున్నది.  ఇక ఇదిలా ఉంటె, ఈ సినిమాలో హీరోలుగా చేస్తున్న ఎన్టీఆర్, రామ్ చరణ్ లు సూపర్ స్టార్ సినిమాను ప్రమోట్ చేయబోతున్నారు.  

సూపర్ స్టార్ అంటే మహేష్ బాబు అనుకుంటున్నారేమో.. మహేష్ బాబు కాదండి.. బాలీవుడ్ సూపర్ స్టార్ దబాంగ్ హీరో సల్మాన్ ఖాన్ సినిమాను ఈ హీరోలు ప్రమోషన్ చేయబోతున్నారు.  దబాంగ్ సీరీస్ లో దబాంగ్ 3 సినిమా డిసెంబర్ 20 వ తేదీన రిలీజ్ కాబోతున్నది.  దబాంగ్ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు.  బాలీవుడ్ లో అనేక రియాలిటీ షోలలో పాల్గొనబోతున్నారు.  సల్మాన్ ఖాన్ ప్రమోషన్స్ అంటే డ్యాన్స్.. హంగామా అంతా ఉంటుంది.  ఇక ఈ సినిమాను తెలుగులో కూడా భారీ ఎత్తున రిలీజ్ చేయబోతున్నారు.  నవంబర్ 2 వ తేదీన ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దబాంగ్ డ్యాన్స్ టూర్ పేరుతో ఈ షో నిర్వహిస్తున్నారు.  ఈ షోలో ఎన్టీఆర్.. రామ్ చరణ్ కు కూడా పాల్గొనబోతున్నారు.  సల్మాన్ తో కలిసి డ్యాన్స్ చేయబోతున్నారట.