ఎన్టీఆర్.. సునీల్ చెప్పింది నిజమే..

ఎన్టీఆర్.. సునీల్ చెప్పింది నిజమే..

అరవింద సమేత వీర రాఘవ సినిమా నిన్న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయింది.  మొదటి నుంచి ఈ సినిమాకు పాజిటివ్ టాక్ ఉన్న సంగతి తెలిసిందే.  ఆ టాక్ ను కంటిన్యూ చేస్తూ.. సినిమా హిట్ అయింది.  అజ్ఞాతవాసి పరాజయం తరువాత త్రివిక్రమ్ కసిగా ఈ సినిమాను చేశారు.  ఎన్టీఆర్ నటన నభూతో నభవిష్యతి అనే విధంగా ఉంది.  మొదటి అరగంట సినిమాను ఎక్కడికో తీసుకెళ్లింది.  

ఈ సినిమాలో ప్రధానంగా చెప్పుకోవలసిన పాత్ర జగపతిబాబు గురించే.  జగపతిబాబు పాత్ర సినిమాను అలా నిలబెట్టింది.  తాను నమ్మిన ఫ్యాక్షన్ కోసం కన్న కొడుకును చంపుకోవడానికి కూడా వెనకాడని క్రూరుడిగా కనిపిస్తాడు.  రఫ్ లుక్ తో పక్కా ఫ్యాక్షన్ లీడర్ గా జగపతిబాబు భయపెట్టే విధంగా నటించాడు.  ఒకవైపు గొంతులో కత్తి దిగి చావు నుంచి బయటపడ్డ.. నిరంతరం పగపగా అంటూ తిరిగే పాత్రలో జగపతిబాబు కేక పుట్టించాడు.  ఫ్యాక్షన్లో మరో కోణాన్ని చూపిస్తానని చెప్పిన త్రివిక్రమ్ ఎన్టీఆర్ ద్వారా ఆ కోణాన్ని ఆవిష్కరిస్తూనే.. జగపతిబాబులో ఇలాంటి ఊర ఫ్యాక్షన్ క్యారెక్టర్ ను కూడా ప్రేక్షకులకు పరిచయం చేశాడు.  సినిమా చూసిన తరువాత జగపతిబాబు క్యారెక్టర్ భయపెడుతుంది అని చెప్పిన సునీల్, ఎన్టీఆర్ లు చెప్పింది అక్షరాలా నిజం.