నాడు ఎన్టీఆర్... నేడు జగన్... 

నాడు ఎన్టీఆర్... నేడు జగన్... 

ప్రజలు ఎన్నుకునే సభను శాసనసభ అంటారు.  అయితే, ఎమ్మెల్యేలు మొత్తం కలిసి ఎన్నుకునే సభను శాసనమండలి అంటారు.  పార్లమెంట్ లో లోక్ సభ, రాజ్యసభ ఉన్నట్టుగానే రాష్ట్రాల్లో శాసనసభ, శాసనమండలి రెండు ఉంటాయి.  అయితే, కొన్ని రాష్ట్రాల్లో ఇవి ఉండకపోవచ్చు కూడా.  అవసరాన్ని బట్టి వీటిని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు.  అయితే,  ఇప్పుడు జగన్ కు శాసనమండలిలో ఇబ్బందులు ఎదురౌతున్న సంగతి తెలిసిందే.  మొన్న ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ కు సంబంధించిన బిల్లును అడ్డుకున్న సంగతి తెలిసిందే.  

ఇప్పుడు మూడు రాజధానులు సంబంధించిన బిల్లును కూడా శాసనమండలి అడ్డుకున్నది.  దీంతో ప్రభుత్వం ఆలోచనలో పడింది.  శాసనమండలిలో జగన్ ప్రభుత్వానికి బలం లేకపోవడంతో బిల్లును అడ్డుకుంటున్నాయి.  ఇది జగన్ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది.  తలనొప్పిగా మారిన శాసనమండలిని రద్దు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.  ఈరోజు దీనిపై నిర్ణయం తీసుకోవచ్చు.  

గతంలో ఎన్టీఆర్ హయాంలో కూడా ఇలానే జరిగింది. శాసనసభలో పాసైన బిల్లులను మండలి అడ్డుకుంటూ వచ్చింది.  అప్పట్లో తెలుగుదేశం పార్టీకి మండలిలో పెద్దగా సంఖ్యాబలం లేదు.  రోశయ్య ఆధ్వర్యంలో మండలి పదేపదే అడ్డుపడుతూ వచ్చింది.  దీంతో 1985లో ఎన్టీఆర్ ప్రభుత్వం శాసనమండలిని రద్దు చేసింది.  2004 లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మరలా శాసనమండలిని తీసుకొచ్చారు.  తండ్రి తీసుకొచ్చిన శాసనమండలి కొడుకు వైఎస్ జగన్ కు తలనొప్పి కలిగిస్తోంది.