ఎన్టీఆర్ అరవింద సమేత కథ ఇదేనా..?

ఎన్టీఆర్ అరవింద సమేత కథ ఇదేనా..?
యాంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అరవింద సమేత వీర రాఘవ అనే సినిమా రూపొండుతున్న సంగతి తెలిసిందే.  అజ్ఞాతవాసి పరాజయం తరువాత త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇదే కావడం విశేషం. అరవింద సమేత సినిమా కోసం ఎన్టీఆర్ తన శరీరాన్ని పూర్తిగా మార్చేశాడు.  సిక్స్ ప్యాక్ పై దృష్టిపెట్టి కథకు తగినట్టుగా శరీరాన్ని మార్పులు చేర్పులు చేశాడు.  త్రివిక్రమ్ తో జూనియర్ కు మొదటి సినిమా కావడంతో సినిమా ఎలా ఉంటుందనే ఆసక్తి పెరిగింది.  ఎన్టిఆర్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.  సిక్స్ ప్యాక్ తో ఆకట్టుకునే విధంగా ఉన్న ఫస్ట్ లుక్ మనకు ఎన్నో విషయాలను చేప్తోంది.  రాయలసీమ బ్యాక్ డ్రాప్ తో వస్తున్న ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉంటాయట.  
 
సామాన్యుడిగా లవర్ బాయ్ గా కనిపించే ఎన్టిఆర్.. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చాలా ఆసక్తి కరంగా ఉంటుందని తెలుస్తోంది.  ఇక, ఈ సినిమాకు మొదట రాఘవ అనే టైటిల్ అనుకున్నా, కథ  దృష్ట్యా అరవింద సమేత సరిగ్గా సరిపోతుందనే ఉద్దేశ్యంతో ఈ సినిమాకు అరవింద సమేత వీర రాఘవ అనే టైటిల్ ను  ఖరారు చేశారు. అ సెంటిమెంట్ ను ఎన్టిఆర్ సినిమాలో కూడా కొనసాగించడం విశేషం.