అరవింద సమేత సందడికి సిద్ధం అవుతోంది..!!

అరవింద సమేత సందడికి సిద్ధం అవుతోంది..!!

అరవింద సమేత... ఎన్టీఆర్ కెరీర్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా.  ఎన్టీఆర్ నటనకు మరో తార్కాణంగా నిలిచింది.  సున్నితమైన కథలను ఎమోషనల్ గా చెప్పగలిగే త్రివిక్రమ్ ఈ సినిమాలో అదే ఫార్ములాను ప్రయోగించి హిట్ కొట్టాడు.  అజ్ఞాతవాసి ఫెయిల్యూర్ తో తెచ్చుకున్న మచ్చను ఈ సినిమాతో పోగొట్టుకున్నాడు.  

ఈ సినిమా హిట్ శాటిలైట్ రైట్స్ ను జీసినిమాస్ తీసుకున్న సంగతి తెలిసిందే.  హిందీ డబ్బింగ్ కార్యక్రమాలు దాదాపుగా పూర్తి చేసుకున్న అరవింద సమేతను హిందీ వెర్షన్ లో టివిలో ప్రదర్శించేందుకు జీ సినిమాస్ సిద్ధం అవుతున్నది. అతి త్వరలోనే ఈ సినిమాను జీ హిందీలో ప్రదర్శించబోతున్నారు.  టాలీవుడ్ సినిమాలకు హిందీలో మంచి గిరాకీ ఉంది.  మరి ఈ అరవిందుడు ఆలా సందడి చేస్తాడో చూడాలి.