అంత తక్కువ రేటింగా..!!

అంత తక్కువ రేటింగా..!!

ఎన్టీఆర్ కెరీర్లో భారీ వసూళ్లు సాధించిన సినిమా అరవింద సమేత.  త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఎన్టీఆర్ నటనకు చాలామంది ఫిదా అయ్యారు.  ఎన్టీఆర్ లో మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించాడు త్రివిక్రమ్.  ఈ సినిమా శాటిలైట్ హక్కులను జీ టెలివిజన్ సంస్థ దక్కించుకుంది.  రీసెంట్ గా ఈ సినిమాను టీవీలో ప్రదర్శించారు.  కొత్త సినిమాకు, అందులోను సూపర్ హిట్టైన సినిమా.. టిఆర్పి రేటింగ్ ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.  

రామ్ చరణ్ రంగస్థలం సినిమాకు టిఆర్పి రేటింగ్ ఎలా వచ్చిందో చూశాం కదా.  అదే రేంజ్ లో రేటింగ్ ఉంటుందని అనుకున్నారు.  అందుకు విరుద్ధంగా వచ్చింది.  కేవలం 13.7 టిఆర్పి రేటింగ్ ను మాత్రమే రావడం విశేషం.  విజయ్ దేవరకొండ సినిమాకు 20, 17 రేటింగ్ వచ్చిన సంగతి తెలిసిందే.