రివ్యూ : అరవింద సమేత వీర రాఘవ 

రివ్యూ : అరవింద సమేత వీర రాఘవ 

న‌టీన‌టులు: ఎన్టీఆర్‌, పూజాహెగ్డే, జ‌గ‌ప‌తిబాబు, సునీల్‌, నాగ‌బాబు, ఈషారెబ్బ‌, సుప్రియ పాత‌క్‌, న‌వీన్ చంద్ర‌, దేవ‌యాని, సితార‌, బ్ర‌హ్మాజీ, రావు ర‌మేష్ త‌దిత‌రులు

సంగీతం: త‌మ‌న్‌

సినిమాటోగ్ర‌ఫీ: పీఎస్ వినోద్‌

నిర్మాత‌: ఎస్‌.రాధాకృష్ణ‌(చిన‌బాబు)

ద‌ర్శ‌క‌త్వం: త్రివిక్ర‌మ్

బ్యాన‌ర్‌: హారిక అండ్ హాసిని క్రియేష‌న్స్‌

రిలీజ్ డేట్ : 11-10-2018

 

ఎన్టీఆర్.. త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న మొదటి సినిమా అరవింద సమేత వీర రాఘవ.  త్రివిక్రమ్ తో సినిమా చేయాలని ఎన్టీఆర్ గత 12 సంవత్సరాలుగా అనుకుంటున్నాడు.  ఆ కల ఇప్పటికి నెరవేరినట్టుగా ఎన్టీఆర్ ఇటీవలే ప్రకటించాడు.  ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజైన ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుందో చూద్దాం.  

కథ : 

 

ఎన్టీఆర్ ఫ్యాక్షన్ గొడవల్లో తండ్రి నాగబాబును కోల్పోతాడు.  నాయనమ్మ చెప్పిన మాటలు విని, ఫ్యాక్షన్ వాతావరణాని దూరంగా ఉండాలని ఎన్టీఆర్ హైదరాబాద్ వస్తాడు.  హైదరాబాద్ లో పూజ పరిచయం అవుతుంది.  పూజ మనస్తత్వం కూడా నయనమ్మలాగే ఉంటుంది.  గొడవల జోలికి వెళ్లోద్దని హెచ్చరిస్తూ ఉంటుంది.  ఇలాంటి సమయంలో ఓసారి పూజపై కొందరు అటాక్ చేస్తారు.  ఆమెను రక్షించిన తరువాత ఎన్టీఆర్ పూజ ఇంటికి వెళ్తాడు.  అక్కడ ఎన్టీఆర్ కు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి..? పూజ ఎవరు..? నానమ్మకు ఇచ్చిన మాటను ఎన్టీఆర్ నిలబెట్టుకున్నాడా లేదా అన్నది కథ. 

 

విశ్లేషణ : 

ఒక చిన్న పాయింట్ ఆధారంగా త్రివిక్రమ్ కథను రాసుకున్నాడు.  వాడిదైన రోజున ఎవడైన ఏదైనా చేయగలడు.. అసలు గొడవలు లేకుండా ఆపుతాడు చూడు వాడు గొప్పవాడు.. ఇదే సినిమా థీమ్.  ఈ థీమ్ ఆధారంగానే సినిమా ఉంటుంది.  గతంలో సీమ బ్యాక్ డ్రాప్ తో అనేక సినిమాలు వచ్చాయి.  కానీ, త్రివిక్రమ్ సీమ బ్యాక్ డ్రాప్ స్టోరీని కొత్తగా చూపించే ప్రయత్నం చేశాడు.  ఫ్యాక్షనిజంలో మరో కోణాన్ని త్రివిక్రమ్ చూపించాడు.  కత్తి పట్టుకొని బయలుదేరిన భర్త గురించి భార్య, పిల్లలు ఎంత తల్లడిల్లి పోతారో ఆ కోణంలో చూపించాడు సినిమాను.  మొదటి 20 నిముషాలు చాలా ఎమోషన్ గా తీశాడు.  ఈ ఎమోషన్ నుంచి కథను మలుపులు తిప్పి హైదరాబాద్ కు తీసుకొస్తాడు.  హైదరాబాద్ లో హీరో, హీరోయిన్ల మధ్య, కమెడియన్ సునీల్ మధ్య కొన్ని కామెడీ సీన్స్ తీసి త్రివిక్రమ్ తన మార్క్ ను చూపించాడు.  అయితే, ఎక్కడ మెయిన్ కథ ట్రాక్ తప్పించలేదు.  ఫస్ట్ హాఫ్ అప్పుడే అయిపోయిందా అనిపించే విధంగా ఉంటుంది.  

 

సెకండ్ హాఫ్ లో త్రివిక్రమ్ తనలోని ప్రతిభను బయటపెట్టాడు.  ఈ సినిమా ద్వారా తాను ఏం చెప్పాలని అనుకుంటున్నాడో దానిని చాలా బలంగా కొన్ని పాత్రల ద్వారా చెప్పడంలో త్రివిక్రమ్ సఫలం అయ్యాడు.  సెకండ్ హాఫ్ మొత్తానికి జగపతి బాబు పాత్ర చాలా కీలకంగా మారుతుంది.  ఆ పాత్రను తీర్చిదిద్దిన తీరు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది.  త్రివిక్రమ్ సినిమాల్లో క్లైమాక్స్ సన్నివేశాలు చాలా బలంగాఉంటాయి.  ఈ సినిమాకు కూడా క్లైమాక్స్ ప్రాణం పోసింది.  ఎక్కడా ఎలాంటి తప్పులు లేకుండా సినిమాను తీర్చి దిద్దాడు.  సాధారణంగా త్రివిక్రమ్ సినిమాల్లో ప్రధానంగా కామెడీ, పంచ్, ప్రాసలు ఉంటాయి.  ఇందులో అలాంటివి కనిపించవు.  కథలోని పాత్రలపైనే ప్రధాన దృష్టిపెట్టాడు.  చెప్పాలనుకున్నది తెరపై చూపించి ఆకట్టుకున్నాడు త్రివిక్రమ్.  

 

నటీనటుల పనితీరు: 

కథకు అనుగుణంగా వీర రాఘవ పాత్రలో ఎన్టీఆర్ ప్రాణం పోశారు.  ఎమోషన్స్ సీన్స్ లో పర్ఫెక్ట్ గా నటించాడు.  కాదు జీవించాడని చెప్పాలి.  ఎన్టీఆర్ చేసిన సినిమాలకు పూర్తి భిన్నంగా సినిమా సాగుతుంది.  పూజ హెగ్డే పాత్ర కీలకం.  అరవింద పాత్రలో పూజ చక్కగా నటించింది.  ఇక బాలిరెడ్డి పాత్రలో జగపతిబాబును చాలా క్రూరంగా చూపించాడు.  బాలిరెడ్డి పాత్రలో జగపతిబాబు ఒదిగిన తీరు అమోఘం.  ఈ సినిమాలోని ప్రతి పాత్ర కీలకమైనది కావడం విశేషం.  

సాంకేతికం : 

ఇలాంటి సున్నితమైన కథలను ఎంచుకొని వాటిని తెరపై చూపించడంలో త్రివిక్రమ్ కు వెన్నతో పెట్టిన విద్య.  ఆ విద్యకు మరికాస్త పదును పెట్టాడు.  తమన్ మ్యూజిక్ ఆకట్టుకుంది.  ఎన్టీఆర్ లోని భావోద్వేగాలను పెర్ఫెక్ట్ గా చూపించడంలో కెమెరామెన్ వినోద్ సక్సెస్ అయ్యాడు.  హారిక అండ్ హాసిని నిర్మాణ విలువలు బాగున్నాయి.  

 

పాజిటివ్ పాయింట్స్ : 

ఎన్టీఆర్ 

త్రివిక్రమ్ మాటలు 

తమన్ మ్యూజిక్ 

నెగెటివ్ పాయింట్స్ : 

కామెడీ లోపించడం 

చివరిగా :  ఎన్టీఆర్ త్రివిక్రమ్ ల మ్యాజిక్ వర్కౌట్ అయింది