ఎన్టీఆర్ బయోపిక్ గురించి మురళీ మోహన్ ఏమన్నారంటే..!

ఎన్టీఆర్ బయోపిక్ గురించి మురళీ మోహన్ ఏమన్నారంటే..!
ఎన్టీఆర్ బయోపిక్ సినిమా షూటింగ్ ఈ నెలలోనే సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు బాలకృష్ణ అండ్ కో ప్లాన్ చేస్తున్నారు.  ఇప్పటికే పూర్తి స్క్రిప్ట్ పూర్తయింది.  బాలకృష్ణ స్వయంగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు.  బరువైన బాధ్యతను భుజాన వేసుకున్న బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ ను ఏ విధంగా హ్యాండిల్ చేస్తాడనే దానిపై ఆసక్తి నెలకొంది.  బయోపిక్ అంటే ఎన్టీఆర్ నట జీవితంతో పాటు రాజకీయ రంగానికి సంబంధించిన విషయాలను కూడా ఇందులో చూపిస్తారా? లేదంటే.. కేవలం సినిమా రంగం వరకే చూపించి వదిలేస్తారా అన్నది తెలియాలి. 
అయితే, ఎన్టీఆర్ బయోపిక్ గురించి ఓ వార్త బయటకు వచ్చింది.  ఎన్టీఆర్ సినీ జీవితంలో జరిగిన కీలక విషయాల గురించి, సినిమా రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీని స్థాపించి వందేళ్ల కాంగ్రెస్ ను ఓడించి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం వరకు ఈ సినిమా లో చూపిస్తారని ప్రముఖ నిర్మాత, నటుడు, ఎంపీ మురళీమోహన్ పేర్కొన్నారు.  ఎన్టీఆర్ బయోపిక్ లో నటించే అవకాశం వస్తే తప్పకుండా నటిస్తానని మురళీ మోహన్ చెప్పారు.