ఎన్టీఆర్ బయోపిక్ ఒక వైపు మాత్రమే!

ఎన్టీఆర్ బయోపిక్ ఒక వైపు మాత్రమే!
దివంగత నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర ఆధారంగా దర్శకుడు తేజ 'ఎన్టీఆర్' సినిమాను రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించనున్నారు. మొదట ఈ సినిమాను రెండు భాగాలుగా చిత్రీకరించాలకున్నారు కానీ ఇంకా ఈ విషయంపై ఎటువంటి నిర్ణయానికి రాలేదని తెలుస్తోంది. ఎన్టీఆర్ బయోపిక్ అనగానే ఆయన జీవితంలో అన్ని ఘట్టాలను తెరపై చూపిస్తారని అభిమానులు ఆశించారు. అయితే దర్శకుడు తేజ ఈ సినిమాలో కేవలం పాజిటివ్ అంశాలను మాత్రమే చూపించబోతున్నారని సమాచారం. ఎలాంటి వివాదాల జోలికి పోకుండా ఎన్టీఆర్ సినీరంగంలో, రాజకీయ రంగంలో సాధించిన విజయాలను కుటుంబానికి చెందిన మరికొంత ఎపిసోడ్ ను ప్రెజంట్ చేయబోతున్నారట. ఈ విషయంలో తేజ చాలా క్లారిటీతో ఉన్నారని సమాచారం. అంటే ఎన్టీఆర్ జీవితంలో ఒకవైపు మాత్రమే ప్రేక్షకులకు చూపించబోతున్నారన్నమాట!