వర్మకు మళ్ళీ ఎదురుదెబ్బ...

వర్మకు మళ్ళీ ఎదురుదెబ్బ...

రామ్ గోపాల్ వర్మ... ఒకప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని శాసించిన వ్యక్తుల్లో ఒకరు.  శివ సినిమాతో సంచలనం సృష్టించిన వర్మ... ఆ తరువాత చేసిన కొన్ని సినిమాలు బాగున్నాయి.  ఇటీవల కాలంలో వర్మ సినిమా అంటే భయంతో పరుగులు తీస్తున్నారు జనాలు.  అయితే, రీసెంట్ గా వర్మ తీసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకు మంచి హిట్ కొట్టింది.  హిట్ కోసం ఎదురుచూస్తున్న వర్మ ఈ సినిమా ఊరటను ఇచ్చింది.  

ఇంతవరకు బాగానే ఉంది.  అయితే, ఈ సినిమా ఏపీ మినహా అన్ని ప్రాంతాల్లో రిలీజ్ అయ్యింది.  ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో సినిమాను నిలిపివేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించడంతో ఏపిలో రిలీజ్ కాలేదు.  ఏప్రిల్ 11 తరువాత రిలీజ్ చేయాలని అనుకున్నా కుదరలేదు.  గత కొన్ని రోజుల క్రితం సినిమాను రిలీజ్ చేస్తున్నారని వార్తలు వచ్చాయి.  కానీ, ఏపిలోని కొన్ని నియోజక వర్గాల్లో రీ పోలింగ్ నిర్వహిస్తుండటం వలన సినిమా విడుదల మరోసారి వాయిదా పడింది.  సినిమాను మే 19 తరువాత మాత్రమే రిలీజ్ చేయాలని ఆదేశాలు ఉండటంతో పాపం వర్మ మరోమారు కష్టాల్లో పడ్డారు.