ఎన్టీఆర్ బయోపిక్ ఉదయం 7 నుంచే మొదలు..!!

ఎన్టీఆర్ బయోపిక్ ఉదయం 7 నుంచే మొదలు..!!

ఎన్టీఆర్ బయోపిక్ సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్నది.  ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్న సమయంలో ఎపి ప్రభుత్వం స్పెషల్ షోలకు అనుమతి ఇచ్చింది.  అక్కడ ఉదయం 5 నుంచే షోలు ప్రారంభం అవుతాయి.  ఇదిలా ఉంటె, తెలంగాణలో స్పెషల్ షోలు వేసుకోవడానికి అనుమతి ఇవ్వడం లేదు. ఏ సినిమా అయినా ఉదయం 8:45 నుంచే అది మల్టీప్లెక్స్ లలో షోలకు అనుమతి ఇస్తుంది.  

ఎన్టీఆర్ బయోపిక్ కు విషయంలో అలా కాకుండా ఉదయం 7 గంటలకు షోలు వేసుకోవడానికి అనుమతి ఇవ్వడం విశేషం.  ఉదయం షోలకు ఇప్పటికే టికెట్స్ చాలా వరకు బుక్ అయ్యాయి. ఈ నైట్ యూఎస్ లో ప్రీమియర్ షోలు ఉన్నాయి కాబట్టి ఎలా ఉంటుందో మరి కొన్ని గంటల్లోనే తేలిపోతుంది.