ఇకపై ఎన్టీఆర్, చరణ్ ఇద్దరూ కలిసే చేస్తారు !

ఇకపై ఎన్టీఆర్, చరణ్ ఇద్దరూ కలిసే చేస్తారు !

'ఆర్ఆర్ఆర్' సినిమా షూటింగ్ మొదలైన ఆరంభంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరి మీదా కొంత షూటింగ్ జరిపిన రాజమౌళి ఆ తర్వాత ఇద్దరిపై విడివిడిగా కూడా చిత్రీకరణ జరిపారు.  కానీ వచ్చే గురువారం నుండి ఇద్దరూ కలిపే షూటింగ్లో పాల్గొననున్నారు.  హీరోలిద్దరి తాలూకు సన్నివేశాలు ముగిసేవరకు ఈ షెడ్యూల్ విరామం లేకుండా జరుగుతుంది.  జాతీయస్థాయి ప్రాజెక్టుగా రూపొందుతున్న ఈ సినిమాను నిర్మాత దానయ్య సుమారు 150 కోట్లతో నిర్మిస్తున్నారు.  2020కి సినిమాను ప్రేక్షకులకు అందివ్వాలనే యోచనలో ఉన్నాడు రాజమౌళి.