ప్రముఖ నిర్మాత మృతికి ఎన్‌టీఆర్ సంతాపం

ప్రముఖ నిర్మాత మృతికి ఎన్‌టీఆర్ సంతాపం

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మేటి నిర్మాతగా నిలిచిన దొరస్వామి నేడు ఉదయం వయోభారం కారణంగా కన్నుమూశారు. ఆయన మృతిపై సినీ ప్రముఖులు అందరూ సంతాపం తెలిపారు. వీరిలో యంగ్ టైగర్ ఎన్‌టీఆర్ కూడా తన సంతాపాన్ని తెలిపాడు. తనకు సింహాద్రి వంటి బ్లాక్ బస్టర్ అందించిన దొరస్వామి గారు హఠాన్మరణం చెందడం ఎంతో బాధాకరమైన విషయం. ఈ వార్త వెనగానే తాను దిగ్ర్భాంతికి గురయ్యానని ఎన్‌టీఆర్ అన్నాడు. ఈ విషయం పై ఎన్‌టీఆర్ తన ట్విటర్ ద్వారా సంతాపం తెలిపాడు. ‘దొరస్వామి గారు ఇకలేరన్న వార్తను నేను తీసుకోలేకపోతున్నాను. ఒక నిర్మాతగా, డిస్ట్రీబ్యూటర్‌గా తెలుగు పరిశ్రమకు అందించిన సేవలు మర్చిపోలేనివి. సింహాద్రి సినిమా విజయంలో అతడి పాత్ర చాలా కీలకం. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన మన మనస్సుల్లో ఎల్లప్పుడూ అమరులై ఉంటారు. ఆయన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా’నని ఎన్‌టీఆర్ ట్వీట్ చేశాడు. ఇదిలా ఉంటే దొరస్వామి మరణంపై దర్శకుడు కే రాఘవేంద్ర రావు గారు కూడా స్పందించారు. దొరస్వామి గారితో తాను ఎన్నో సినిమాలు చేశామని, అతనితో ఉన్న జ్ఞాపకాలన్నీ తనకు గుర్తుకొస్తున్నాయన చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నానంటూ రాఘవేంద్ర రావు గారు సంతాపం తెలిపారు.