కొమురం భీమ్.. సరికొత్త రికార్డు

కొమురం భీమ్.. సరికొత్త రికార్డు

రాజమౌళి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న 'ఆర్ఆర్ఆర్' సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్.. కొమురం భీమ్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియన్ సినిమాగా రూపొందుతున్న 'ఆర్ఆర్ఆర్‌'లో.. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు. అయితే ఎన్టీఆర్ పాత్రకి సంబంధించిన కొమురం భీమ్ టీజర్ టాలీవుడ్‌లో సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

 'ఆర్ఆర్ఆర్' నుంచి, అక్టోబర్ 22న విడుదలైన 'రామరాజు ఫర్ భీమ్' టీజర్ యూట్యూబ్ లో ఇప్పటి వరకు 50 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టింది. అంతేకాదు, టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో 50 మిలియన్ల వ్యూస్ మార్క్ అందుకున్న మొట్ట మొదటి టీజర్‌గా కొమురం భీమ్ ఇంట్రో వీడియో రికార్డ్ క్రియేట్ చేసింది. 

ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్, బ్రిటన్ మోడల్ ఓలివియా మోరీస్ నటిస్తుండగా.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా అక్టోబర్ 13న రిలీజ్ కాబోతోంది.