ఆర్ఆర్ఆర్ టీమ్ ను ఆటాడేసుకుంటున్న ఫ్యాన్స్..!! 

ఆర్ఆర్ఆర్ టీమ్ ను ఆటాడేసుకుంటున్న ఫ్యాన్స్..!! 

ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ దాదాపుగా 40శాతం పూర్తయినట్టు తెలుస్తోంది.  సినిమా రిలీజ్ చేయటానికి సమయం చాలా తక్కువగా ఉన్నది.  రాజమౌళి సినిమా అంటే పర్ఫెక్ట్ గా వచ్చే వరకు షూట్ చేస్తూనే ఉంటారు.  దసరా, దీపావళి ఇలా పండుగలకు సినిమాలకు సంబందించిన స్పెషల్ లుక్స్ ను రిలీజ్ చేస్తుంటారు.  కానీ, దసరాకు ఆర్ఆర్ఆర్ నుంచి ఎలాంటి లుక్ రిలీజ్ కాలేదు.  

ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తున్నారు.  ఈరోజు కొమరం భీం జయంతి.  ఈ స్పెషల్ డే రోజున ఏదైనా స్పెషల్ ఫోటో రిలీజ్ చేస్తారేమో అనుకున్నారు.  కానీ, ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ లేదు.  ఆర్ఆర్ఆర్ మూవీ యూనిట్ మాత్రం ట్విట్టర్లో ఓ మెసేజ్ షేర్ చేసింది.  కొమరం భీం జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన యూనిట్, ఎన్టీఆర్ ను కొమరం భీంగా తెరపై చూసేందుకు ఉత్సాహంగా ఉన్నామని చెప్తూ ట్వీట్ చేసింది.  ఈ ట్వీట్ పై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.  కొమరం భీంజయంతి రోజున కనీసం ఎన్టీఆర్ లుక్ ను రిలీజ్ చేస్తారని అనుకోని ఆశగా ఎదురు చూస్తుంటే.. ఇలా షాక్ ఇస్తారా అని మండిపడుతున్నారు.  ఫోటో రిలీజ్ చేయకుండా ఇలాంటి మెసేజ్ ఏంటి అని కొందరు ప్రశ్నిస్తున్నారు. ఇంకొందరైతే ఫన్నీ ఫోటోలు ఫోటోలు షేర్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.