ఎన్టీఆర్ ఫ్యాన్స్ విన్నపాన్ని మహేష్ మన్నిస్తాడా..?

ఎన్టీఆర్ ఫ్యాన్స్ విన్నపాన్ని మహేష్ మన్నిస్తాడా..?

ఎన్టీఆర్ అరవింద సమేత వీర రాఘవ గత వారం రిలీజ్ అయ్యి మంచి టాక్ సొంతం చేసుకుంది.  సినిమాకు భారీ వసూళ్లు వస్తున్నాయి.  యూఎస్ మొదటిరోజు మంచి వసూళ్లు వచ్చినా.. ఆ తరువాత నెమ్మదించాయి.  తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఈ సినిమా దూసుకుపోతున్నది.  తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ కు క్రేజ్ ఉన్నది.  యూఎస్ లో మంచి మార్కెట్ ఉన్నప్పట్టికీ పెద్దగా లాభం లేకుండా పోయింది.  

ఎన్టీఆర్ అరవింద సమేత సినిమా సాధారణ ప్రేక్షకులకే కాకుండా సెలెబ్రిటీలకు కూడా బాగా నచ్చింది. టాప్ టెక్నిషియన్లు, టాప్ సెలెబ్రిటీలు ఈ సినిమా గురించి మాట్లాడున్న సంగతి తెలిసిందే.  రాజమౌళి, రామ్ చరణ్ లు ఈ సినిమా గురించి ట్విట్టర్, పేస్ బుక్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేశారు.  ఇది ఈ సినిమాకు ప్లస్ అయింది.  రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ ల మధ్య మంచి వాతావరణం ఉంది.  ముగ్గురు అనేక పబ్లిక్ ఫంక్షన్స్ లో కలుసుకుంటున్నారు.  ఒకరి సినిమాలను మరొకరు మెచ్చుకుంటున్నారు.  ఇది మంచి పరిణామమే.  మహేష్ బాబు బిజీ కారణంగా అరవింద సమేత సినిమా గురించి ఇంతవరకు ఎలాంటి కామెంట్ చేయలేదు.  షూటింగ్ బిజీ వలన సినిమా చూడలేకపోయి ఉండొచ్చు.  కాస్త తీరిక చేసుకొని ఎన్టీఆర్ కోసం సినిమా చూసి రెస్పాండ్ కావాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోరుకుంటున్నది.  ట్విట్టర్ ద్వారా మహేష్ కు ఫ్యాన్స్ విజ్ఞప్తి చేస్తున్నారు.  మహేష్ బాబుకు యూఎస్ లో మంచి మార్కెట్ ఉన్నది.  మహేష్ అరవింద సమేత సినిమా గురించి ట్వీట్ చేస్తే.. అది యూఎస్ కలెక్షన్లపై ప్రభావం చూపుతుందని, సినిమాకు ప్లస్ అవుతుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.  మరి ఎన్టీఆర్ ఫ్యాన్స్ విజ్ఞప్తిని మహేష్ బాబు మన్నిస్తారా.. చూడాలి.