పన్నెండేళ్ళ యమదొంగ....ట్విట్టర్ వార్ కి రెడీ !

పన్నెండేళ్ళ యమదొంగ....ట్విట్టర్ వార్ కి రెడీ !

 

సోషల్ మీడియా విరివిగా అందుబాటులోకి వచ్చాక ఒకరకంగా సినీ అభిమానులకి ఖర్చు తప్పిందనే చెప్పాలి. ఒకప్పుడు హీరో సినిమా రిలీజ్ అన్నా, హీరో పుట్టిన రోజు ఉన్నా వేల కొలదీ రూపాయలు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని కామన్ డీపీ పెట్టేస్తే చాలు, అభిమానం నిరూపించుకున్నట్టే. అలా కామన్ డీపీ సంస్కృతి వేగంగానే విస్తరించింది. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే ఆ కామన్ డీపీతో ట్రెండ్ సృష్టించడానికి రెడీ అవుతున్నారు జూనియర్ ఫ్యాన్స్. నిజానికి పన్నెండేళ్ళ క్రితం జూనియర్ ఎన్టీఆర్‌, ప్రియ‌మ‌ణి జంట‌గా న‌టించిన య‌మ‌దొంగ‌ సినిమా ఆగష్టు 15వ తేదీన రిలీజయ్యింది. ఎస్‌.ఎస్‌. రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వం వచించిన ఈ సినిమా అప్పట్లో రికార్డులు సృష్టించింది. సోషియో ఫాంటసీ సబ్జెక్ట్ గా తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫిస్ వ‌ద్ద రికార్డులు సృష్టించి 30.1కోట్ల షేర్‌ను ద‌క్కించుకుంది.

నిజానికి యమ దొంగ సినిమాకి ముందు ఎన్టీఆర్ చాలా లావుగా ఉండేవాడు. రాఖీ, యమదొంగ సినిమాల్లో ఎన్టీఆర్ ని చూస్తే ఈ విషయం అర్ధం అవుతుంది. యమదొంగ సినిమాకి మరీ ఒక్కసారిగా బక్కచిక్కిపోయి కనిపించాడు. అప్పట్లో యమదొంగ కథ చెప్పడానికి వెళ్ళిన రాజమౌళి, ఇలా చూడలేకపోతున్నామండీ. ఇంత లావుగా ఉంటే అమ్మాయిలు థియేటర్లకి రారన్నాడట, దాంతో లైపోసెక్షన్ చేయించుకుని మరీ బరువు తగ్గాడు జూనియర్. అప్పటి నుండి కెరీర్ కాస్త గాడిలో పడింది.

అదంతా పక్కనపెడితే అసలు ఇప్పుడు ఈ కామన్ డీపీ ట్రేండింగ్ ఎందుకా ? అంటే మొన్న మహేష్ బర్త్ డేకి, మహేష్ ఫ్యాన్స్ ట్రెండ్ సృష్టించారు. ఇప్పటికిప్పుడు ఎన్టీఆర్ పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ ఏవీ లేవు. ఈ సినిమా రిలీజ్ డేట్ ఒక్కటే దగ్గరగా ఉండడంతో #12yearsforYamadongaCDP హ్యాష్ ట్యాగ్ ని ట్రెండ్ చేస్తున్నారు. ఏదేమైనా ఫ్యాన్స్ ఇలాంటి సోషల్ మీడియా ట్రెండ్స్ లాంటివి కాకుండా జనానికి ఉపయోగపడేవి చేస్తే బాగుంటుందని కొందరు నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.