ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏం చేస్తున్నారో తెలుసా? 

ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఏం చేస్తున్నారో తెలుసా? 

రాజమౌళి దర్శకత్వంలో ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా తెరకెక్కుతోంది.  ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. సినిమా విషయంలో ఆర్ఆర్ఆర్ ఎక్కడా తగ్గడం లేదు.  పాన్ ఇండియా మూవీ పైగా ఎన్టీఆర్, రామ్ చరణ్ లు ఇద్దరు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు.  కాబట్టి క్రేజ్ వచ్చింది.  ఈ క్రేజ్ కు తగ్గట్టుగానే సినిమాను షూట్ చేస్తున్నారు.  ఈ సినిమా షూటింగ్ మొదలయ్యి సంవత్సరం దాటిపోయింది.  ఇప్పటి వరకు 70శాతానికి పైగా షూటింగ్ పూర్తయింది.  మరో నాలుగైదు నెలలో అంతా కంప్లీట్ కాబోతున్నది.  

కానీ, ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి పోస్టర్ గాని, టైటిల్ గాని రిలీజ్ కాలేదు.  దీంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. సంక్రాంతికి కనీసం ఒక్క పోస్టర్ అయినా వస్తుందేమో అనుకున్నారు.  జనవరి 26 న ఏదైనా లుక్ రిలీజ్ చేస్తారేమో అనుకున్నారు.  అదీ లేదు.  దీంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు.  కాగా, ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఓ ట్యాగ్ క్రియేట్ చేశారు.  మరో వందరోజుల్లో ఎన్టీఆర్ పుట్టినరోజు ఉన్నది.  ఆరోజున తప్పకుండా ఈ సినిమాకు సంబంధించిన ఎన్టీఆర్ పోస్టర్ తప్పకుండా రిలీజ్ చేయాల్సి ఉంటుంది.  లేదంటే మాత్రం అభిమానుల కోపం కట్టలు తెంచుకుంటుంది.  వచ్చే ఏడాది జనవరి 8 న సినిమా రిలీజ్ కాబోతున్నది.  మరి చూద్దాం ఏమౌతుందో.