ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో స్వల్ప వాగ్వాదం 

ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో స్వల్ప వాగ్వాదం 

ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో స్వల్ప వాగ్వాదం జరిగింది. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ ఘాట్‌ వద్ద నివాళులర్పించేందుకు ఆయన సతీమణి లక్ష్మీపార్వతి వచ్చారు. చంద్రబాబునాయుడు ఎన్నికల్లో ఓటమి చెందడంతో ఎన్టీఆర్‌ ఆత్మ శాంతించిందని ఆమె పేర్కొంటుండగా.. ఇక్కడ రాజకీయాలు మాట్లాడితే సహించేది లేదంటూ చంద్రబాబు అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈక్రమంలో జై ఎన్టీఆర్‌ - జై చంద్రబాబు అంటూ పోటాపోటీగా నినాదాలు చేసుకున్నారు.