రేపటి నుండే షూట్ మొదలుపెట్టమన్న ఎన్టీఆర్ !

రేపటి నుండే షూట్ మొదలుపెట్టమన్న ఎన్టీఆర్ !

జూ.ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే.  నిన్ననే ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి.  తండ్రి అకాల మరణంతో ఎన్టీఆర్ తీవ్ర ఆవేదనకు గురయ్యారు.  ఆ భాధ నుండి ఆయన తేరుకోవడానికి కొంత సమయం పడుతుంది కనుక ప్రస్తుతం ఆయన చేస్తున్న 'అరవింద సమేత' షూటింగ్ ఇప్పుడప్పుడే పూర్తికాదని అంతా అనుకున్నారు. 

కానీ ఎన్టీఆర్ మాత్రం అంత బాధలోనూ భాద్యతను మర్చిపోలేదు.  తనను నమ్మి డబ్బు పెట్టిన నిర్మాతలు ఇబ్బందిపడకూడదనే ఉద్దేశ్యంతో రేపటి నుండే షూట్ మొదలుపెట్టమని త్రివిక్రమ్ కు చెప్పారట.  ఎన్టీఆర్ కూడా రేపటి నుండే షూటింగ్లో పాల్గొననున్నారు.  పని పట్ల ఇంతటి డెడికేషన్ ఉంది కాబట్టే తారక్ కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకోగలిగారు.