ఆ లక్కీ ఛాన్స్ దక్కేది ఎన్టీఆర్‌కేనా !

ఆ లక్కీ ఛాన్స్ దక్కేది ఎన్టీఆర్‌కేనా !

'కె.జి.ఎఫ్' చిత్రాన్ని చూసిన చాలామంది హీరోలు ఆ చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో నటించాలని ఆశపడుతున్నారు.  అతనితో సినిమాకు ఏవైనా అవకాశం ఉంటుందేమోనని చూస్తున్నారు.  అలాంటి హీరోలు తెలుగులో కూడా ఉన్నారు.  అయితే కోరుకోకుండానే ఆ ఛాన్స్ ఎన్టీఆర్‌ను వెతుక్కుంటూ వచ్చిందట.  

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో ఒక సినిమా చేయాలని  నిర్ణయించింది.  ఈ మేరకు ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు.  అందులో ఎన్టీఆర్‌ను హీరోగా తీసుకోవాలని చూస్తున్నట్టు టాక్.  ఇదే గనుక నిజమైతే తారక్ ఖాతాలో ఒక హెవీ మాస్ కమ్ యాక్షన్ ఎంటర్టైనర్ పడటం ఖాయం.