ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ఆ రోజున వస్తుందా?

ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ఆ రోజున వస్తుందా?

ఎన్టీఆర్.. రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్ సినిమా ఆర్ఆర్ఆర్.  రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు.  ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నది.  ప్రస్తుతం ఎన్టీఆర్ కు సంబంధించిన సన్నివేశాలను షూట్ చేస్తున్నారు.  ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నారు.  రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజుగా కనిపిస్తున్నారు.  

ఇప్పటికే ఈ సినిమా చాలాసార్లు వాయిదా పడింది.  ఇకపైనా రెస్ట్ లేకుండా షూటింగ్ చేయాలని రాజమౌళి ఆదేశాలు జారీ చేశారు.  దానికి తగ్గట్టుగానే షూటింగ్ జరుగుతున్నది.  షూటింగ్ విషయాలు బయటకు లీక్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  ఆగష్టు 15 వ తేదీ దగ్గరకు వస్తుండటంతో ఈ సినిమాకు సంబంధించిన ఏదైనా ట్రీట్ ఉంటుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ కొమరం భీం ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తారని సమాచారం అందుతోంది.  అయితే దీన్ని యూనిట్ అధికారికంగా ప్రకటించాల్సి ఉన్నది.