క్లైమాక్స్ కంటతడి పెట్టిస్తుందట

క్లైమాక్స్ కంటతడి పెట్టిస్తుందట

ఎన్టీఆర్ బయోపిక్ లోని సెకండ్ పార్ట్ మహానాయకుడు రేపు రిలీజ్ కాబోతున్నది.  ఈరోజు సాయంత్రం 7 గంటలకు సినీ ప్రముఖులు, కుటుంబ సభ్యుల కోసం ఏఎంబి సినిమాస్ లో ప్రీమియర్ షో వేశారు.  ఈ షో ఇప్పటికే పూర్తయింది.  అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా క్లైమాక్స్ చాలా భావోద్వేగంతో కూడుకొని ఉందని, ప్రతి ఒక్కరి హృదయాలను కదిలిస్తుందని తెలుస్తోంది.  

సినిమా రిలీజ్ కు ముందు నిర్వహించే ప్రీ రిలీజ్ వేడుకలు, భారీ ప్రమోషన్లు వంటివి చేయకుండా సినిమాను సైలెంట్ గా రిలీజ్ చేస్తున్నారు.  ఎమోషనల్ గా సినిమా బాగుందని టాక్ వినిపిస్తోంది.  ఈ ఎమోషన్ ఎంతవరకు వర్కౌట్ అయింది.  సినిమా ఎలా ఉంటుందనే విషయాలు పూర్తిగా తెలియాలంటే రేపటి వరకు ఆగాల్సిందే.