ఫిబ్రవరి 22 న ఎన్టీఆర్ మహానాయకుడు

ఫిబ్రవరి 22 న ఎన్టీఆర్ మహానాయకుడు

ఎన్టీఆర్ బయోపిక్ ను రెండు భాగాలుగా చిత్రీకరించిన సంగతి తెలిసిందే.  సినిమా జీవిత  రంగానికి సంబంధించిన ఫస్ట్ పార్ట్ జనవరి 9 న రిలీజ్ అయ్యింది.  ఈ సినిమా బాగుందనే టాక్ వచ్చినా.. ఎందుకో బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం విజయం సాధించలేకపోయింది.  ఫస్ట్ పార్ట్ లో చేసిన తప్పులను సెకండ్ పార్ట్ లో చేయకూడదని భావించిన దర్శకుడు క్రిష్.. సెకండ్ పార్ట్ కు అవసరమైన రిపేర్లు చేసినట్టు తెలుస్తోంది.  

మహానాయకుడు సినిమాను మొదట ఫిబ్రవరి 7 వ తేదీన రిలీజ్ చేయాలని అనుకున్నారు.  తప్పులను సరిద్దిద్దుకోవడానికి సమయం తీసుకోవడంతో.. సినిమాను ఫిబ్రవరి 7 వ తేదీ నుంచి ఫిబ్రవరి 22 వ తేదీకి పోస్ట్ ఫోన్ చేశారు.  ఫిబ్రవరి 22 వ తేదీన సినిమాను రిలీజ్ చేయాలని యూనిట్ నిర్ణయం తీసుకున్నట్టుగా వార్తలు అందుతున్నాయి.  రాజకీయాలకు సంబంధించిన సినిమా కావడంతో, క్రిష్ సినిమాను ఎలా డీల్ చేశాడో అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.